17 తరవాత పరిస్థితి ఏంటి.. సీఎం సమీక్ష

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికి కొనసాగుతున్న మూడో విడత లాక్‌డౌన్ ఈనెల 17తో ముగియనుంది. దాంతో లాక్డౌన్ అనంతరం నిషేధాజ్ఞలు కొనసాగించాలా లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 13న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి జిల్లా కలెక్టర్లతో సమావేశమవుతున్నారు. కరోనాకు చికిత్స అందించే వైద్య నిపుణుల కమిటీ సభ్యుల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకుంటారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు ముఖ్యమంత్రి పళనిస్వామి.
రాష్ట్రంలోని ప్రజలంతా నిషేధాజ్ఞల నుంచి బయటపడేందుకే మొగ్గు చూపుతున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగం కేంద్ర మంత్రిత్వ కార్యదర్శితో ఆదివారం చర్చలు జరిపారు. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు అధికమవుతున్న విషయాన్ని ఆయన కేంద్ర మంత్రివర్గానికి వివరించారు. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 6535కు చేరుకోగా, 44 మంది మృతి చెందినట్లు తెలిపారు. 1824 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com