అమెరికాలో అదుపులోకి రాని కరోనా.. ఒక్కరోజే..

అమెరికాలో అదుపులోకి రాని కరోనా.. ఒక్కరోజే..

అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధిక శాతం అమెరికాలోనే ఉన్నాయి. తాజాగా శనివారం నమోదైన కేసుల సంఖ్య 25,621.. కాగా 1,615 మంది మృత్యువాత పడ్డారు. అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 60 వేలు దాటదని చెప్పిన కొన్ని రోజులకే ఆ నెంబర్ దాటి 80 వేలకు చేరుకుంది. తాజా గణాంకాల ప్రకారం మరణాల సంఖ్య లక్షనుంచి రెండు లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడిపై ఒబామా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కరోనా కట్టడికి ట్రంప్ ప్రభుత్వం తగిన చర్యలు అవలంభించకపోవడం వల్లే వ్యాప్తి విస్తృతమైందని ఇది అధ్యక్షుడి తప్పిదంగా ఆయన అభివర్ణించారు.

Tags

Read MoreRead Less
Next Story