ఆంధ్రప్రదేశ్

జూన్ 8 వరకు లాక్డౌన్

జూన్ 8 వరకు లాక్డౌన్
X

కృష్ణాజిల్లా నూజివీడులో జూన్ 8 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు తహశీల్దారు ఎం. సురేష్ కుమార్ తెలిపారు. గత వారం ఓ మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. అయినా మరోసారి నిర్ధారణకు వచ్చే నిమిత్తం ఆ శాంపిల్‌ని విజయవాడ కూడా పంపించారు. అక్కడ కూడా పాజిటివ్ అని వచ్చింది. దాంతో కరోనా వ్యాప్తి నిర్మూలనకు లాక్డౌన్ కొనసాగించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు తహశీల్దారు. రెడ్ జోన్ మినహా మిగిలిన ప్రాంతాల్లో కూరగాయలు, నిత్యావసర సరుకుల దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరవాలని చెప్పారు.

Next Story

RELATED STORIES