దేశంలో గడిచిన 24 గంటల్లో 3 వేల 525 పాజిటివ్‌ కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 3 వేల 525 పాజిటివ్‌ కేసులు
X

దేశంలో కరోనాకు బ్రేకులు పడడం లేదు. రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. గడిచిన 24 గంటల్లో 3 వేల 525 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 122 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 74 వేల 281కి చేరుకున్నాయి.

ఇప్పటి వరకు 2 వేల 415 మంది మృతి చెందారు. 24 వేల 386 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశవ్యాప్తంగా 47 వేల 480 యాక్టిక్‌ కేసులు ఉన్నాయి. దేశంలో భారీగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్‌ కల్లోలం సృష్టిస్తోంది. ఆరాష్ట్రంలో వైరస్‌ బాధితులు 25 వేలకు చేరువయ్యారు.

Tags

Next Story