సీఎం జగన్‌కు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ

సీఎం జగన్‌కు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ
X

మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల్ని వేలం వేయటాన్ని తప్పుబట్టారు బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. విశాఖపట్నం, గుంటూరు భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కు లేఖ రాశారు. గత ప్రభుత్వం చేసిన పొరపాటునే జగన్ కూడా చేస్తున్నారని ఆరోపించారు. నవరత్నాల హామీ అమలు కోసం భూములు తెగనమ్మి నిధులు సమీకరించటం సరికాదన్నారు. ప్రజా ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాల కోసం విలువైన భూములు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలన్నారు.

Tags

Next Story