కరోనా తరువాత వచ్చే వైరస్ అమెజాన్ అడవుల్లో పుడుతుంది

కరోనా తరువాత వచ్చే వైరస్ అమెజాన్ అడవుల్లో పుడుతుంది

కరోనాతో పోరాటం చేస్తున్న యావత్ ప్రపంచం.. ఇక తరువాత అమెజాన్ అడవుల నుంచి వచ్చే వైరస్ తో పోరాటం చేయాల్సి ఉంటుందని ప్రముఖ పర్యావణ శాస్త్రవేత్త డేవిడ్ లపోలా వ్యాఖ్యానించారు. పట్టణీకరణ పెరగటంతో అమెజాన్ అడవులు కోతకు గురవుతున్నాయని.. ఇదే వైరస్ వ్యాప్తికి కారణం కాబోతుందని హెచ్చరించారు. అడవులు కుంచిచుకుపోవడంతో జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయని.. అయితే, వాటితో పాటు హానికారక వైరస్ వెంట తీసుకొస్తున్నాయని అన్నారు. దీని వల్ల కరోనా లాంటి మరో మహమ్మారికి అమెజాన్ అడవులు హాట్‌స్పాట్‌గా మారే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. ‘అనేక రకాల వైరస్‌లకు అమెజాన్ ఆలావాలం. అక్కడికి వెళ్లి మన అదృష్టాన్ని పరీక్షించుకోవద్దు’ అని డేవిడ్ వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story