ఢిల్లీలో గడిచిన 24గంటల్లో 438 కరోనా పాజిటివ్ కేసులు

ఢిల్లీలో గడిచిన 24గంటల్లో 438 కరోనా పాజిటివ్ కేసులు
X

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కట్టడి కావటంలేదు. రోజురోజుకు ఈ మహమ్మారి విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 438 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కేసులు సంఖ్య 9,333కు చేరుకుంది. అక్కడ ఇప్పటి వరకు 3,926 మంది కోలుకోగా.. 5,278మంది ఇంకా చికిత్స పొందుతున్నట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. అటు, ఇప్పటివరకూ 129మంది ఈ మహమ్మారి దాటికి బలయ్యారు. అటు, కరోనా కట్టడి ఢిల్లీ ప్రభుత్వం తీవ్రగా కృషి చేస్తుంది.

Tags

Next Story