ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ
X

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. అమరావతి ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. జస్టిస్‌ సోమయాజులు స్టే ఆదేశాలు ఇచ్చారు. రాజధాని అభివృద్ధి ప్రాంతం పరిధిలోని పేదలకు గత ప్రభుత్వం నిర్దేశించిన స్థలాలను కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పేదలకు ప్రస్తుత ప్రభుత్వం కేటాయించింది.

అయితే, ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతి పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా సుదూర ప్రాంతాల వారికి ఇవ్వడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం స్టే ఆదేశాలు ఇచ్చింది.

Tags

Next Story