ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టిన స్కార్పియో.. స్పాట్‌లోనే ముగ్గురు..

ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టిన స్కార్పియో.. స్పాట్‌లోనే ముగ్గురు..

నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలి తీసుకుంది. బీహార్‌ నుంచి కేరళ వెళ్తున్న స్కార్పియో వాహనం ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. డిచ్‌పల్లి మండలం నాకా తండా వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో అనీష్‌ థామస్‌, అతని కొడుకు అనలియాతో పాటు స్టాలిన్‌ అనే వ్యక్తి ఉన్నారు. వీరంతా కేరళకు చెందిన టీచర్లుగా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story