వందే భారత్‌ మిషన్‌.. హైదరాబాద్‌కు చేరుకున్న 121 మంది తెలుగు ప్రయాణికులు

వందే భారత్‌ మిషన్‌.. హైదరాబాద్‌కు చేరుకున్న 121 మంది తెలుగు ప్రయాణికులు

వందే భారత్‌ మిషన్‌ శరవేగంగా కొనసాగుతోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించే ప్రయత్నం జోరందుకుంది. ఇందులో భాగంగా అమెరికా నుండి ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో 121 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు.. ఈ తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. హైదరాబాద్‌కు చేరుకున్న ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ వైద్య పరీక్షల అనంతరం.. పెయిడ్‌ క్వారంటైన్‌కు తరలించారు.

కరోనా నేపథ్యంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎయిర్‌ పోర్ట్‌ మొత్తాన్ని కెమికల్‌ క్లీనింగ్‌ చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు తిరిగిన ప్రతి చోటును శానిటైజ్‌ చేస్తున్నారు. ఇక ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ క్లియరెన్స్‌ నిర్వహించే సిబ్బంది పీపీఈ కిట్లను ఉపయోగిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story