కోతులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగం.. మంచి ఫలితం

కోతులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగం.. మంచి ఫలితం

కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆక్సఫర్డ్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కోతులపై వ్యాక్సిన్ ప్రయోగించగా ఆశించిన ఫలితాలు వచ్చాయని తెలిపింది. కోతుల్లో ప్రయోగించిన ఈ వ్యాక్సిన్ ప్రతికూల ఫలితాలు ఇవ్వకపోగా.. కరోనా వైరస్ ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని ఇచ్చాయని.. మొదటి డోస్ లోనే మంచి ఫలితాలు కనిపించాయని అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు. ముందుగా కోతులుకు కరోనా సోకేలా చేశామని.. అనంతరం వాటిపై వ్యాక్సిన్ ప్రయోగించామని తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చిన కోతుల్లో.. వ్యాక్సిన్ ఇవ్వని కోతుల కంటే ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. వాటి ఊపిరితిర్తుల్లో కరోనా వైరస్ కణాల సంఖ్య బాగ తగ్గిందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలు తలమునకలైన వేళ శుభవార్తగా చెప్పుకోచ్చు.

Tags

Read MoreRead Less
Next Story