అర్థనగ్నంగా విశాఖ వీధుల్లో డాక్టర్ సుధాకర్.. అసలు ఏమైందీ?

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో అనస్థీషియన్‌గా పనిచేస్తూ.. వేటుకు గురైన డాక్టర్ సుధాకర్.. శనివారం విశాఖ వీధుల్లో అర్దనగ్నంగా కనిపించాడు. ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సునిశిత విమర్శలు గుప్పించాడు. కరోనా విజృంభిస్తున్న సమయంలో.. బాధితులకు చికిత్స అందించేందుకు కనీసం ఆస్పత్రిలో మాస్కులు కూడా లేవని.. డాక్టర్లకు సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో.. ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు డాక్టర్ సుధాకర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. శనివారం విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం, పోర్టు హాస్పిటల్ ఎదురుగా డాక్టర్ సుధాకర్ అర్ధ నగ్నంగా కనిపించాడు. ఆయన రెండు చేతులను పోలీసులు వెనక్కు పెట్టి తాళ్లతో బంధించారు. అనంతరం అతను రోడ్డుపై పడిపోయాడు. ఆ తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా ఆటోలో ఎక్కించి.. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అసలు.. డాక్టర్ సుధాకర్ విశాఖ రోడ్లపైకి ఎలా వచ్చాడు? అర్ధనగ్నంగా ఎందుకున్నాడు? ఆయన్ను ఎందుకు తాళ్లతో బంధించారు? సస్పెండ్ అయిన తర్వాత డాక్టర్ సుధాకర్ ఎటు వెళ్లాడు? ఇన్నాళ్లు ఎందుకు కనిపించలేదు.. ఇవాళ వైజాగ్‌లో అర్దనగ్నంగా ఎందుకు కనిపించాడు.. ఈ ప్రశ్నలకు పోలీసులు మాత్రమే సమాధానం చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com