చైనాపై కేసులు పెట్టేందుకు అనుమతినివ్వండి.. మోదీకి లేఖ

చైనాపై కేసులు పెట్టేందుకు అనుమతినివ్వండి.. మోదీకి లేఖ
X

చైనాపై కేసులు పెట్టేందుకు ప్రజలుకు అనుమతినివ్వాలని ప్రధాని మోదీకి ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ లేఖ రాసింది. చైనా నగరమైన వుహాన్ లో పుట్టి ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తుందని అన్నారు. భారత్ లో కరోనా కేసులు లక్షకు చేరువలో ఉన్నాయని.. ఇప్పటి వరకూ 2,752 మంది కరోనా మహమ్మారికి బలయ్యారని లేఖలో ప్రస్తావించారు. అంతే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని.. వీటన్నింటికీ కారణం చైనా అని అన్నారు. కనుక, దేశ ప్రజలకు చైనాపై కేసులు పెట్టే అనుమతివ్వాలని కోరారు. దీనికి అనుగుణంగా. సీపీసీ సెక్షన్ 86ను సవరించాలని.. దీనికోసం ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకొనిరావాలని ప్రధానిని కోరారు.

Tags

Next Story