ఆంధ్రప్రదేశ్

ఏపీలో మారిపోతున్న కరోనా లెక్కలు.. గడిచిన 24 గంటల్లోనే అమాంతం పెరిగిపోయిన పాజిటివ్ కేసులు

ఏపీలో మారిపోతున్న కరోనా లెక్కలు.. గడిచిన 24 గంటల్లోనే అమాంతం పెరిగిపోయిన పాజిటివ్ కేసులు
X

ఏపీలో కరోనా లెక్కలు మారిపోతున్నాయి.. కేసులు తగ్గుతున్నాయని ఊరట చెందిన 24 గంటల్లోనే మళ్లీ అమాంతం పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో 52 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2282కు చేరింది.. ఏపీలో 24 గంటల్లో చికిత్స తీసుకుని పూర్తి ఆరోగ్యంతో 94 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1527కు చేరింది. ప్రస్తుతం 705 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు, కృష్ణా జిల్లాల నుంచి నుంచి 15 మంది చొప్పున ఉన్నారు.. తూర్పుగోదావరి జిల్లాలో 5, కడపలో రెండు, కర్నూలులో 4, నెల్లూరులో ఏడు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కటి చొప్పన, పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరులో 12, నెల్లూరులో ఏడు కేసులు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చిన వారివిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 24 గంటల్లో మొత్తం 9,713 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 52 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అయితే, గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు.. కరోనా మరణాల సంఖ్య 50గా ఉంది. ఇక అనంతపురం, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో గత 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

కరోనా కేసుల్లో జిల్లాల వారిగా చూస్తే కర్నూలు జిల్లా 615 కేసులతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండగా.. 417 కేసులతో గుంటూరు రెండో స్థానంలో ఉంది. కృష్ణాలో 382, చిత్తూరులో 192, నెల్లూరులో 157, అనంతపురం 122, కడప 104, విశాఖపట్నం 76, పశ్చిమగోదావరి 72, ప్రకాశం జిల్లాలో 66 కేసులు నమోదయ్యాయి. అటు ప్రకాశం జిల్లాలో ఇప్పటికే 63 మంది డిశ్చార్జ్‌ కాగా.. ప్రస్తుతం ముగ్గురికి చికిత్స కొనసాగుతోంది.. విజయనగరంలో అత్యంత తక్కువగా 8 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఇవి కాకుండా, ఇతర రాష్ట్రాలకు చెందిన 125 యాక్టివ్‌ కేసులున్నాయి.. మహారాష్ట్ర 101, గుజరాత్‌ 26, ఒడిశా 10, కర్నాటక 1, వెస్ట్‌ బెంగాల్‌ 1, రాజస్థాన్‌లో 11 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.. గుజరాత్‌కు చెందిన మరో ఇద్దరు కోవిడ్‌ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యారు.

Next Story

RELATED STORIES