భారత్‌లో వైరస్ విజృంభణ.. ఒక్కరోజులో 5242 పాజిటివ్ కేసులు

మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా అనుకున్నంత స్థాయిలో లేదని సంబరపడుతుంటే.. అంతలోనే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. లాక్డౌన్ విధించి కరోనాని కట్టడి చేసామనుకుంటే దేశం నలుమూలలనుంచి రోజుకి వందలు, వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5242 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 157 మరణాలు సంభవించాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో ఇప్పటి వరకు దేశం మొత్తంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 96,169కి చేరుకుంది. మృత్యువాత పడిన వారు 3029గా కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉండడం ఆనందించదగ్గ పరిణామం. మొత్తం బాధితుల్లో 36,824 మంది కోలుకోగా మరో 56,316 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com