టిక్‌టాక్‌లో పరిచయం.. ప్రేమ,పెళ్లి పేరుతో..

టిక్‌టాక్‌లో పరిచయం.. ప్రేమ,పెళ్లి పేరుతో..

ఇంకెప్పుడు మారతారు.. ఇన్ని అనర్థాలు జరుగుతున్నా ఒక్కటీ మీ చెవికి ఎక్కట్లేదా.. ఒక్క క్షణం అయినా ఆలోచించకుండా నయవంచకుల బారిన పడి బలవుతునే ఉన్నారు. దృశ్య శ్రవణ మాధ్యమాలొచ్చాయి అన్నీ కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నాయి. అయినా మోసాలు.. అత్యాచారాలు.. ఆగట్లేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా టిక్‌టాక్‌లో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి మోసం చేశాడో దుర్మార్గుడు. ఆట అయినా హద్దులు మీరనంత వరకే సరదా.. ఏ మాత్రం పట్టుతప్పినా జీవితం చేజేతులా పాడుచేసుకోవడమే.

నిందితుడికి అప్పటికే పెళ్లయి, నలుగురు పిల్లలు ఉన్నారు. అయినా పాతబస్తీకి చెందిన యువతితో ప్రేమాయణం సాగించాడు. అక్బర్‌షా అనే వ్యక్తితో ఆమె టిక్‌టాక్‌ ద్వారా పరిచయం పెంచుకుంది. అది కాస్తా ప్రేమగా మారి ఆమె తన సర్వస్వాన్ని అర్పించింది. కోర్కె తీర్చుకోవడానికి ముందు పెళ్లి చేసుకుంటానని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. ప్లాన్‌లో భాగంగా బంధువుల సమక్షంలో ఆమెతో నిశ్చితార్థం కూడా కానిచ్చాడు. అనంతరం మరోసారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత పత్తాలేడు. అప్పుడు గానీ ఆమె మేల్కోలేదు. తాను మోసపోయానని తెలుసుకుంది. చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story