తెలంగాణలో కొత్తగా మరో 41 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా మరో 41 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా మరో 41 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిలో 26 కేసులు హైదరాబాద్‌లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో 3 కేసులు నమోదు కాగా.. కొత్తగా 12 మంది వలస కార్మికులకు కరోనా సోకింది. దీంతో ఇప్పటివరకు 69 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చింది.

సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1592కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 1002 మంది డిశ్చార్జి అయ్యారు. 34 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 556 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా పాజిటివ్ కేసులలో హైదరాబాద్ వెయ్యి మార్కును దాటేసింది. కొత్త కేసులతో నగరంలో కేసుల సంఖ్య 1007కు చేరింది.

జిల్లాలవారీగా చూస్తే హైదరాబాద్ తర్వాత 83 పాజిటివ్ కేసులతో సూర్యాపేట జిల్లా రెండోస్థానంలో వుంది. 61 కేసులతో నిజామాబాద్ జిల్లా మూడోస్థానంలో వుండగా.. జోగులాంబ గద్వాల జిల్లా 45 కేసులతో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 44, వికారాబాద్ జిల్లాలో 37, వరంగల్ అర్బన్ జిల్లాల్లో 27, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 25 పాజిటివ్ కేసులున్నాయి.

ఇక, ఆదిలాబాద్జిల్లాలో 21, నిర్మల్ జిల్లాలో 20, కరీంనగర్ జిల్లాలో 19, నల్గొండ జిల్లాలో 17, కామారెడ్డి జిల్లాలో 12, మహబూబ్ నగర్ జిల్లాలో 11 కేసులు నమోదు కాగా.. 14 జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి.

వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అటు 25 జిల్లాల్లో 14 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

Tags

Read MoreRead Less
Next Story