ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే నాకు కరోనా: మంత్రి జితేంద్ర ఆహ్వా

కరోనా సోకి కోలుకున్నాను కానీ ఏప్రిల్ 23 నుంచి 26 వరకూ నా జీవితంలో అత్యంత కీలకమైన రోజులు అని మహారాష్ట్ర మంత్రి జితేంద్ర ఆహ్వా ప్రకటించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నాను. నా కుటుంబీకులు నేను బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆందోళన చెందారు. ఆ సమయంలో నేను జీవితం గురించి చాలా ఆందోళన చెందా. నా అతి విశ్వాసమే నన్ను ఇంత వరకు తెచ్చిందని మదన పడ్డా. మరణానికి దగ్గరగా వెళ్లిపోయానని భావించి నా ఆస్తి మొత్తం నా కూతురుకే చెందాలని ఐసీయూలో ఉన్నప్పుడు వీలునామా కూడా రాసేశానని ఆయన తెలిపారు.
మంత్రి దగ్గర విధులు నిర్వర్తించే సెక్యూరిటీ అధికారికి ఏప్రిల్ 13న పాజిటివ్ అని తేలింది. దీంతో ఎందుకైనా మంచిదని మంత్రి కూడా టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకీ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. అసలే బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారు. దీనికి తోడు కరోనా వచ్చింది. కరోనా సోకడంతో బ్రతుకు మీద ఆశలు కోల్పోయానని అన్నారు. అయితే నా ఓవర్ కాన్ఫిడెన్సే నాకు కరోనా రావడానికి కారణమైందని అర్ధం చేసుకున్నాను అని మే 10 కోలుకుని ఇంటికి వచ్చిన మంత్రి జితేంద్ర అన్నారు. నా ఆరోగ్యం పట్ల, నా జీవన శైలి పట్ల నేను చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాను అనేది కరోనాతో నిజమైందని, ఇకపై చాలా క్రమశిక్షణతో జీవితాన్ని గడపాలనుకుంటున్నానని జితేంద్ర ఆహ్వా పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com