అంతర్జాతీయం

వర్క్ ఫ్రం హోం వద్దు.. ఆఫీస్ వర్క్ ముద్దు: సత్య నాదెళ్ల

వర్క్ ఫ్రం హోం వద్దు.. ఆఫీస్ వర్క్ ముద్దు: సత్య నాదెళ్ల
X

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించడంతో పలు రంగాలు వర్క్ ఫ్రం హోం తో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, సాఫ్ట వేర్ సంస్థలు చాలా వరకూ శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం కొనసాగించాలని చూస్తున్నాయి. దీనిపై మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా వర్క్ ఫ్రం హోం ప్రతిపాదన సమర్థించే వారందరిని వ్యతిరేకించారు. ఇది ఉద్యోగుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని.. తోటి ఉద్యోగులతో సంబంధాలు దెబ్బతింటాయని ఆయన అన్నారు. వీడియా కాల్స్ తో ఉద్యోగుల మధ్య సంబంధాలు మెరుగు పడవని అన్నారు. తోటి ఉద్యోగి పక్కనే ఉంటే.. ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని.. ఇది మానసిక ఉల్లాసాన్ని పెంచుతుందని.. దీంతో పని ఒత్తిడి తగ్గుతుందని సత్య నాదెళ్ల అన్నారు.

Next Story

RELATED STORIES