అంగన్‌వాడీ టీచర్‌పై అధికార పార్టీ నాయకుడి దాడి

అంగన్‌వాడీ టీచర్‌పై అధికార పార్టీ నాయకుడి దాడి
X

గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో దారుణం జరిగింది. అంగన్‌వాడీ టీచర్‌పై అధికారపార్టీ నాయకుడు దాడికి తెగబడ్డాడు. మహిళ అని కూడా చూడకుండా...తాము అధికార పార్టీకి చెందిన వాళ్లమని దుర్భాషలాడుతూ... గ్రామస్తుల ముందే దాడి చేశాడు. వైసీపీకి చెందిన ఎంపీటీసీ ఎరుకుపాటి శ్రీను, బండారు లక్ష్మణ్‌, బండారు రాముడు అనే వ్యక్తులు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారని... 100 నంబర్‌కు ఫోన్‌ చేసినా ఎవరూ పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ కారంపూడి పోలీస్‌ స్టేషన్‌ ముందు పడిగాపులు కాస్తున్నారు.

Tags

Next Story