రాయలసీమకు నీళ్లు ఇవ్వకుండా నా ఇంటిని ముంచారు: చంద్రబాబు

X
ఏపీ సీఎం సంవత్సరంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. ప్రభుత్వానికి ప్రాజెక్టుల గురించి అవగాహన కూడా లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరంతో ఏపీ-తెలంగాణ మధ్య ఇండియా- పాకిస్తాన్ లా వార్ జరుగుతుందన్న జగన్.. సీఎం అయ్యాక అదే కాళేశ్వరం ప్రారంభోత్సానికి వెళ్లారని అన్నారు. పట్టిసీమతో రాయలసీమకు నీరు ఇచ్చింది తామేనని అన్నారు చంద్రబాబు. కక్షసాధింపులకు పోయి రాయలసీమకు నీరు ఇవ్వకుండా తన ఇంటిని ముంచాలని కుట్ర చేశారని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
