కూతురు వెంట పడుతున్నాడని.. యువకుడిని కొట్టి చంపిన తండ్రి

కూతురు వెంట పడుతున్నాడని.. యువకుడిని కొట్టి చంపిన తండ్రి

కూతురు వెంటపడుతున్నాడంటూ ఓ యువకుడిని కొట్టి చంపాడో తండ్రి. మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహులు ప్రేమ పేరుతో తన కూతురు వెంట పడుతున్నట్లు అమ్మాయి తండ్రి చెబుతున్నాడు. ప్రేమ పేరుతో వేధిస్తుండటంతో బంధువులతో కలిసి యువతి తండ్రి దాడి చేశాడు. ఈ దాడిలో నర్సింహులుకు తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న నర్సింహులును ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికత్స పొందుతూ అతను మృతి చెందాడు.

Tags

Read MoreRead Less
Next Story