19 May 2020 7:51 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / వివాదాస్పద ప్రాంతాలతో...

వివాదాస్పద ప్రాంతాలతో కొత్త మ్యాప్‌కు ఆమోదం తెలిపిన నేపాల్ కేబినెట్

వివాదాస్పద ప్రాంతాలతో కొత్త మ్యాప్‌కు ఆమోదం తెలిపిన నేపాల్ కేబినెట్
X

భారత్-నేపాల్ మధ్య వివాదాస్పద ప్రాంతాలను తమ ప్రాంతాలుగా చూపించే విధంగా రాజీకీయ పటానికి నేపాల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది. ఈ భూబాగాలపై ఇరుదేశాలు దౌత్యపరంగా పరిస్కరించుకుంటామని ఇటీవల నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలి అన్నారు. అయితే, ఇంతలోనే ఇలాంటి వివాదాస్పదన నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.

ప్రస్తుతానికి భారత భూబాగంలో ఉన్న లిపులేఖ్, కాలాపాని ప్రాంతాలను నేపాల్ తమ దేశంలో ధార్చులా జిల్లాలోని అంతర్భాగమని వాదిస్తుంది. అయితే, భారత్ మాత్రం ఈ ప్రాంతాలు ఉత్తరాఖండ్ లోని అంతర్భాగాలని చెబుతుంది. లిపులేఖ్, కాలాపాని, లింపియాధుర ప్రాంతాలను తమ ప్రాంతాలుగా చూపించే విధంగా కొత్త మ్యాప్ రూపొందించేందుకు నేపాల్ కేబినేట్ ఆమోదం తెలిపింది. అంతటితో ఆగకుండా.. ఈ మూడు ప్రాంతాలలోని నేపాల్ భూభాగాలను తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ లో తీర్మానం ప్రవేశ పెట్టారు.

Next Story