కరోనా విజృంభణతో ఆందోళన కలిగిస్తున్న తమిళనాడు.. కొత్తగా 743 కేసులు

కరోనా విజృంభణతో ఆందోళన కలిగిస్తున్న తమిళనాడు.. కొత్తగా 743 కేసులు
X

తమిళనాడులో కరోనా ప్రభావం రోజు రోజుకి తీవ్రమవుతోంది. ప్రతీ రోజు 500కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 743 కరోనా కేసులు నమోదైయ్యాయని.. దీంతో మొత్తం కేసులు సంఖ్య 13,191కి చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం కరోనాతో ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 87కు చేరింది. ఇంకా 7,219 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story