దేశంలో మరణాల రేటు 3.5 ఉంటే.. తెలంగాణలో 2.1 ఉంది: ఈటెల రాజేందర్

దేశంలో మరణాల రేటు 3.5 ఉంటే.. తెలంగాణలో 2.1 ఉంది: ఈటెల రాజేందర్

కరోనా వైరస్ లక్షణాల గురించి ICMR అధ్యయనం చేస్తోందని అన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేందర్. మొదటి నుంచి కరోనా రాకూడదని.. తీవ్రత ఉండకూడదని కోరుకున్నామని అన్నారు. వైరస్ వచ్చాక 40 రోజులు ఉంటుందా అని కేంద్రాన్ని అడిగామని.. ఆసుపత్రిలో చేరాక ఏడో రోజువరకు లక్షణాలు లేకుంటే పరీక్షలు అక్కర్లేదని చెప్పినట్టు ఈటెల తెలియజేశారు. అలాంటివారిని 14 రోజులు హోం క్వారంటైన్‌కు పంపాలని కేంద్రం సూచించిందన్నారు ఈటెల. తెలంగాణలో కరోనా మరణాల రేటు 2.1 శాతం వుందన్న ఆయన.. దేశంలో 3.5 శాతం కరోనా మరణాల రేటు వుందన్నారు. వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్ అభినందించారు.

Tags

Read MoreRead Less
Next Story