పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ టీడీపీ నిరసన దీక్ష

X
ఏపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ టీడీపీ నిరసన దీక్ష చేపట్టింది. విజయవాడ కేశినేని భవన్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, కేశినేని శ్వేత నిరసన దీక్షకు దిగారు. ఓవైపు కరోనాతో పేద ప్రజలు అల్లాడిపోతుంటే, ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమన్నారు కళా వెంకట్రావు. సీఎం, మంత్రులకు అవగాహన లేక ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని అన్నారు. కరోనా సమయంలో ఇచ్చిన బిల్లులను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత శ్లాబ్ విధానాన్నే కొనసాగించాలని.. లేదంటే, ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు కళా వెంకట్రావు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
