కరోనా ఎఫెక్ట్: ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు

కరోనా ఎఫెక్ట్: ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు

కరోనా.. కొన్ని కోట్ల మందిని కటిక పేదరికంలో నెట్టేస్తుందని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్‌పాస్ హెచ్చరించారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధిస్తున్నాయని.. అయితే, ఈ చర్యలతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలవుతోంది. పేదరిక నిర్మూలన కోసం దేశాలన్ని సాధించిన ప్రగతి అంతా ఈ కరోనా మహమ్మారి రాకతో తుడుచుపోయే ప్రమాదం ఉందని అన్నారు. దీంతో సుమారు 6 కోట్ల మంది కటిక పేదరికంలో కూరుకుపోయే అవకాశం ఉందని అన్నారు. ఈ ఆపత్కర సమయంలో వర్థమాన దేశాలకు ప్రపంచ బ్యాంకు సాయం అందిస్తుందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story