ఏటీఎంకి వెళ్లి కరోనాని వెంట తీసుకుని..

ఏటీఎంకి వెళ్లి కరోనాని వెంట తీసుకుని..
X

చెన్నై మనలికి చెందిన వ్యక్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. లాక్డౌన్‌తో ఆఫీస్ మూత పడింది. సడలింపుల్లో భాగంగా బుధవారం నుంచి ఆఫీస్‌కి రమ్మని, వచ్చే ముందు కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని రావాల్సిందిగా యాజమాన్యం మెసేజ్ పెట్టింది. దాంతో కొవిడ్ టెస్ట్ చేయించుకున్న అతడికి పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. 50 రోజుల్నించి ఎక్కడికీ వెళ్లలేదు. అయినా ఎలా వచ్చింది అని ఆరా తీయగా ఏటీఎం సెంటర్‌కి వెళ్లి డబ్బు డ్రా చేసుకుని వచ్చిన విషయం గుర్తుకొచ్చింది. అక్కడి నుంచే కరోనా వచ్చి వుంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో అప్రమత్తమైన కార్పొరేషన్ అధికారులు ఆ ఏరియాలో రాకపోకలు నిషేధించారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కరోనా పరీక్షలకు వెళ్లే ముందు చేతిలో డబ్బులు లేవని ఏటిఎం సెంటర్‌కి వెళ్లి వచ్చానని చెప్పాడు.

Tags

Next Story