కరోనాతో మృతి చెందిన తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్

కరోనాతో మృతి చెందిన తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్

తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌‌కు చెందిన కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి వైరస్‌తో పోరాడి ప్రాణాలు కోల్పోయారని డిజీపీ మహేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. దయాకర్ బుధవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కానిస్టేబుల్ కుటుంబసభ్యులకు డీజీపీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని ఆయన అన్నారు. మన్సూరాబాద్‌కు చెందిన దయాకర్.. జియాగూడలో విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ అంత్యక్రియలను ఐదుగురి సమక్షంలో నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40కి చేరింది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 27 పాజిటివ్ కేసులు నమోదవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story