తెలంగాణలో మరో 62 కేసులు.. ఏడుగురు డిశ్చార్జ్

తెలంగాణలో మరో 62 కేసులు.. ఏడుగురు డిశ్చార్జ్

తెలంగాణాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 62కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 1761 చేరిందని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది. గత కొన్ని రోజుల నుంచి ఎక్కువ కేసులు హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో 42కేసులు హైదరాబాద్ లోనే. ఈరోజు ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మరణాలు 48కి చేరాయి. శుక్రవారం ఏడుగురు డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,043కు చేరుకుంది. కాగా, ఇంకా.. 670 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story