తెలంగాణలో కొత్తగా 66కేసులు.. 2 వేలకు చేరువలో బాధితులు

తెలంగాణలో కొత్తగా 66కేసులు.. 2 వేలకు చేరువలో బాధితులు

తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,920 చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 1164 మంది డిశ్చార్జి అయ్యారు. 700 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా సోమవారం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 56కు పెరిగిందని రాష్ట వైద్య ఆరోగ్య తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story