టీటీడీ ఆస్తుల అమ్మకం వ్యవహారంపై ఇంకా అనుమానం ఉంది: కన్నా

టీటీడీ ఆస్తుల అమ్మకం వ్యవహారంపై ఇంకా అనుమానం ఉంది: కన్నా
X

సీఎం జగన్‌కి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. తమిళనాడులోని TTD ఆస్తుల వేలం వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిపై తమకు అనేక సందేహాలు ఉన్నాయన్నారు. తాజాగా తాము చేస్తున్నపోరాటంతో 2016 నాటి టీటీడీ తీర్మానం పక్కకుపెట్టారు సరే.. 2020 ఫిబ్రవరిలో తీర్మానం, ఏప్రిల్‌లో TTD ఆదేశాల్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. ఈ విషయంలో తమకు ఇంకా అనుమానం ఉందని కన్నా అన్నారు. ఏప్రిల్ 30న టీటీడీ తీసుకున్న నిర్ణయం రద్దు చేసే వరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు. టీటీడీ ఆస్తులు ఏవీ విక్రయించడం లేదని ప్రకటించే వరకూ పోరాటం ఆగబోదన్నారు కన్నా. ఈ విషయంపై CMకు లేఖ రాయడమే కాదు ట్విట్టర్‌లోనూ పలు ప్రశ్నలు సంధించారు.

Tags

Next Story