అడ్డు అదుపులేకుండా విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోన్న కరోనా మహమ్మారి

అడ్డు అదుపులేకుండా విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోన్న కరోనా మహమ్మారి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. పలు దేశాల్లో అడ్డు అదుపులేకుండా విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్ని కఠినమైన చర్యలు చేపట్టినా దాని ప్రభావం ఏమాత్రం తగ్గడంలేదు. దీనితో రెండువందలకు పైగా దేశాలు అతలాకుతలమవుతున్నాయి. అగ్రదేశాలు అమెరికాతోపాటు రష్యాలోను కోవిడ్ ప్రభావం అధికంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 3లక్షల51 వేల మందికిపైగా కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. మొత్తం కేసులు 56లక్షల 76వేలు దాటాయి. 24లక్షల 26వేల మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

కోవిడ్ 19 వైరస్ ప్రమాద కరస్థాయిలో విస్తరిస్తోంది. మానవ వినాశనమే లక్ష్యంగా అన్నట్లు విజృంభిస్తోంది. ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. వందకు పైగా దేశాల్లో పరిస్థితి మరీ భయానకంగా ఉంది. ఇక అగ్రదేశం అమెరికాలోనే లక్ష మంది వైరస్ బారిన పడి మరణించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశంలో మొత్తం కేసులు సంఖ్య 17లక్షల 8వేలు దాటింది. యూఎస్ లో 4లక్షల 64వేల మంది వైరస్ బారినుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

బ్రెజిల్‌లో తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. దేశంలో ఇప్పటివరకు 23వేల 5వందల మందికిపైగా మరణించారు. మొత్తం కేసులు 3లక్షల 76వేలు దాటాయి. 1లక్ష 53 వేలమంది వైరస్ బారినుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రష్యాలోను కేసుల తీవ్రత తగ్గడంలేదు. ఇప్పటివరకు 3లక్షల 62వేల కేసులు నమోదయ్యాయి. 3వేల 8వందల మంది మృత్యువాత పడ్డారు. 1లక్ష 31వేల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

స్పెయిన్ లో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో వైరస్ సోకి 26వేల 8వందల మంది మరణించారు. మొత్తం కేసులు 2లక్షల 82వేలకు పైగా నమోదయ్యాయి. 1లక్ష 96వేల 9వందల మందికిపైగా వైరస్ బారినుంచి బయటపడ్డారు. యూకేలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడంలేదు. దేశంలో ఇప్పటివరకు 36 వేల 9వందలమందికిపైగా మరణించారు. 2లక్షల 61వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక ఇటలీలో కోవిడ్ తీవ్రత తగ్గుదల కనిపించడంలేదు. ఇటలీలో ఇప్పటివరకు 32వేల 8వందలమందికిపైగా కరోనా వైరస్ సోకి మృత్యువాత పడ్డారు. దేశంలో 2లక్షల 30వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 1లక్ష 41వేల మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story