తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ మహానాడుకు సర్వం సిద్ధం

తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ మహానాడుకు సర్వం సిద్ధం
X

డిజిటల్ శకానికి పునాదులు వేసిన చంద్రబాబు హాయంలో ఈ సారి మహానాడు కూడా డిజిటల్ రూపు సంతరించుకుంది. భౌతిక దూరం పాటిస్తూ మహానాడు నిర్వహించేలా వర్చువల్ సెటప్ సిద్ధమైంది. బుధవారం ప్రారంభమయ్యే మహానాడులో దాదాపు 14 వేల మంది తమ్ముళ్లు ఆన్ లైన్ ద్వారా పాల్గొనబోతున్నారు. ఇందుకనుగుణంగా అధినేత చంద్రబాబు ప్రతి ఒక్కరికీ డిజిటల్ ఆహ్వానాలు పంపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 13తీర్మానాలను ఈసారి మహానాడులో ఆమోదించనున్నారు.

మే 27వ తేది నుంచి రెండ్రోజుల పాటు జరిగే మహానాడు ప్రతి సారికి భిన్నంగా నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితులకు అనుగుణంగా మహానాడును నిర్వహించేందుకు టీడీపీ తనదైన స్టైల్ లో ప్లాన్ చేసుకుంది. రియల్ టైం గవర్నెన్స్ లాంటి కార్యక్రమాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవటంలో ముందుండే చంద్రబాబు నాయుడు..మహానాడును వర్చువల్ గా నిర్వహించబోతున్నారు. డిజిటల్ మహానాడులో పాల్గొనే పార్టీ శ్రేణులకు అధినేత చంద్రబాబు ఇప్పటికే డిజిటల్ ఆహ్వానం పంపారు. మహానాడులో పాల్గొనేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఆహ్వానంలో సూచనలు చేశారు. ప్రతి కార్యకర్త మొబైల్‌ ఫోన్‌ లేదా ట్యాబ్‌లో జూమ్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పంపిన లింక్‌ను ట్యాప్‌ చేసి స్క్రీన్‌ నేమ్‌ దగ్గర పేరును ఎంటర్ చేయాలి. అలాగే ‘జీమెయిల్‌’ దగ్గర mahanadu@tdp.com అని టైప్‌ చేసి మహానాడులో చేరాలని పిలుపునిచ్చారు.

Tags

Next Story