తెలంగాణలో పెరిగిన పాజిటివ్ కేసులు.. ఆరుగురు మృతి

లాక్డౌన్ సడలింపులతో జనం విచ్చలవిడిగా రోడ్ల మీదకు వస్తున్నారు. ఇప్పటిదాకా కరోనాని కంట్రోల్ చేయడం ఒక ఎత్తైతే ఇప్పడు కంట్రోల్ చేయడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొత్తగా 107 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అందులో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు 39 మంది కాగా.. వలస వచ్చిన 19మందికి, సౌదీ నుంచి వచ్చిన మరో 49 మందికి కరోనా అని నిర్ధారణ అయింది. లాక్డౌన్ సడలింపులతో ఇతర రాష్ట్రాలు, దేశాలనుంచి రాష్ట్రానికి రాకపోకలు ఎక్కువయ్యాయి.
అయితే వీరి సంఖ్యను వేరుగా చూపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1842కి చేరగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 297 మందికి వైరస్ సోకినట్లు తేలింది. రాష్ట్రంలో మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 63కు చేరుకుంది. ఇప్పటి వరకు 1321 మంది డిశ్చార్చి కాగా, 714 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో మొత్తం కరోనా కేసులు.. 1842, వలస వచ్చిన వారిలో 173 మందికి, సౌదీ నుంచి వచ్చిన వారిలో 94 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 30 మందికి కరోనా సోకినట్లు తాజా సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com