ప్రధాని మోదీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లేఖ

X
By - TV5 Telugu |29 May 2020 3:03 AM IST
మహారాష్ట్ర గురించి ప్రధాని వ్యక్తిగతంగా ఆలోచించి సాయం చేయాలని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు. లాక్ డౌన్ అమలులో ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగా పూర్తిగా దెబ్బతిన్నది అని.. దీంతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైందని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థకు మూలకారణమైన రియల్ ఎస్టేట్ రంగంలో లాక్‌డౌన్‌తో డిమాండ్ తగ్గిందని అన్నారు. ఈ రంగం దేశ జీడీపీలో ముఖ్యపాత్ర పోషిస్తుందని లేఖలో ప్రస్తావించారు. ఆర్థిక కార్యకలాపాలు అన్ని పూర్తిగా స్తంభించిపోయిందని శరద్ ప్రస్తావించారు. ప్రధాని వ్యక్తిగతంగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com