ఎయిమ్స్‌లో కరోనా.. 11 మంది హెల్త్‌కేర్ వర్కర్స్‌కు..

ఎయిమ్స్‌లో కరోనా.. 11 మంది హెల్త్‌కేర్ వర్కర్స్‌కు..
X

కరోనా రోగులకు సేవ చేస్తున్న ఆస్పత్రికి సిబ్బంది, వైద్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశరాజధాని ఢిల్లోలో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎయిమ్స్‌లో పని చేస్తే 11 మంది హెల్త్‌కేర్ వర్కర్లకు పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో ఒక్క ఎయిమ్స్‌లో వచ్చిన పాజిటివ్ కేసుల సంఖ్య 206కు చేరింది. వీరిలో ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లు కూడా ఉన్నారు.

అయితే వైరస్ వచ్చిన 150 మంది కోలుకుని మళ్లీ విధుల్లో జాయినైనట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకే శర్మ వెల్లడించారు. గత మూడు రోజుల్లోనే 64 మంది హెల్త్‌కేర్ వర్కర్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి వచ్చిన కరోనా కేసుల వివరాలు చూస్తే ఇద్దరు ఫ్యాకల్టీ లెక్చరర్లు, పది మంది రెసిడెంట్ డాక్టర్లు, 26 మంది నర్సులు, తొమ్మిది మంది టెక్నీషియన్లు, ఐదుగురు మెస్ వర్కర్లు, 49 మంది అటెండర్లు, 34 మంది శానిటేషన్ వర్కర్లు, 69 మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఎయిమ్స్‌లో విధులు నిర్వర్తించే సిబ్బంది పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సూపరిండెంట్ స్పష్టం చేశారు. అయినా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

Tags

Next Story