పైలట్‌కు కరోనా.. గమ్యస్థానం చేరకుండా వెనక్కి వచ్చిన విమానం

పైలట్‌కు కరోనా.. గమ్యస్థానం చేరకుండా వెనక్కి వచ్చిన విమానం
X

భారత్ నుంచి బయలుదేరిన ఏ320 విమానం గమ్యస్థలం చేరుకోకుండానే.. మళ్లీ వెనక్కు వచ్చింది. వందేభారత్ పేరుతో విదేశాల్లో చిక్కుకున్న వారిని సొంతప్రాంతలకు తీసుకొచ్చేందుకు కేంద్రం విమానాలు నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మాస్కోలో చిక్కుకున్న వారని తీసుకొచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఏ320 విమానం బయలుదేరింది. అయితే, విమాన పైలట్లలో ఒకరికి కరోనా ఉందని గ్రౌండ్ సిబ్బంది తెలిపింది. దీంతో పైలట్ విమానం వెనక్కు తిప్పి మళ్లీ ఢిల్లీ విమానాశ్రయం చేరుకుంది. ఢిల్లీలో బయలుదేరిన విమానం ఉజ్బెకిస్థాన్ గగనతలంతోకి చేరుకోగానే.. పైలట్ కు.. గ్రౌండ్ సిబ్బంది నుంచి విషయం తెలిసింది. దీంతో వెనక్కు వచ్చిన పైలట్లను క్వారంటైన్ కు తరలించారు. అటు, విమానాన్నికూడా న్‌ఫెక్షన్ లేకుండా శుద్ధి చేశారు.

Tags

Next Story