కరోనా రోగుల శాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతి

X
కరోనా రోగుల బ్లెడ్ సాంపిల్స్ ను ఓ కోతి లాక్కెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్ లో చోటు చేసుకుంది. లాలా లజపతిరాయ్ వైద్య కళాశాల ల్యాబ్ టెక్నీషియన్ నుంచి కరోనా రోగుల రక్తనమూనాలు ఓ కోతి తీసుకెళ్లింది. తీసుకెళ్లిన వాటిని ఆ కోతి నములుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇదే విషయంపై స్పందించి వైద్యకళాశాల ప్రిన్సిపాల్.. కోతి తీసుకెళ్లినవి మామూలు రక్తనమూనాలే మాత్రమేనని.. గొంతు, నాలుకకు సంబంధించిన స్వాబ్ శాంపిల్స్ కావని అన్నారు. కరోనా శాంపిల్స్ ను ఓపెట్టెలో జాగ్రత్తగా భద్రపరిచి ఉంచారని తెలిపారు. అటు, కోతుల ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదని ఆయన తెలిపారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
