ఇండియా పేరు మార్చాలని వేసిన పిటిషన్పై విచారణ జూన్ 2కు వాయిదా

X
ఇండియాగా ఉన్న మనదేశం పేరును భారత్ అని మార్చాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు జూన్ 2 న విచారించనుంది. మన దేశాన్ని భారత్ లేదా హిందుస్థాన్ అని పిలిస్తే గర్వంగా ఉంటుందని.. ఇండియా అనే పేరును తొలగిస్తే.. పర పాలకుల జాడల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని పిటిషనర్ తెలిపారు. పేరును మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ సుప్రీం కోర్టును కోరారు. దేశ భూబాగం, పేరును గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ నెం. 1లో ఉందని .. దీనిని సవరించి పేరు మార్చాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ఈ కేసును జూన్ 2 కు వాయిదా వేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
