కరోనా రోగులకు ఎస్‌బీఐ సహాయం

దేశవ్యాప్తంగా కోవిడ్-19 రిలీఫ్ ఆపరేషన్స్‌లో.. SBI తన వంతు సామాజిక బాధ్యత నిర్వహిస్తోంది. తెలంగాణలో SBI ఫౌండేషన్ ద్వారా ఒక కోటి 10 లక్షల రూపాయల విలువ చేసే సహాయం చేస్తోంది. అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా ఆహార పంపిణీతోపాటు, మెడికల్ ఎక్విప్‌మెంట్, ప్రభుత్వ ఆసుపత్రులకు 6 వేల PPE కిట్లను అందిస్తోంది. SBI హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ OP మిశ్రా తెలంగాణ రాష్ట్ర CS సోమేష్ కుమార్‌ను కలిసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసిబ్బంది కోసం PPE కిట్లను అందించారు. వీటిని తెలంగాణలోని గాంధీ, ఉస్మానియా, వరంగల్ MGM, నిజామాబాద్, నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో SBI DGC & CDO కె.వి. బంగార్రాజు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ LSSVD హనుమంతరావు, AGM PR జి.రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com