వలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి: బండారు సత్యనారాయణ

X
వలంటీర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సన్యాసినాయుడు కుటుంబాన్ని.. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పరామర్శించారు. అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుడి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. సన్యాసినాయుడు తన కుటుంబంలో ఒకడిగా మెలిగేవాడని అన్నారు. కుటుంబంలో ఒక మనిషి కోల్పోతే ఆ బాధ ఎలావుంటుందో సీఎంకు తెలియదా అని ప్రశ్నించారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం అవసరం లేదని.. ఆ కుటుంబాన్ని తానే ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఆయన.. రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థను రద్దుచేయాలని.. సన్యాసినాయుడు మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
