ప్రపంచ వ్యాప్తంగా 62 లక్షల కరోనా కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా 62 లక్షల కరోనా కేసులు..

వైరస్ వ్యాప్తిని అరికట్టే నిమిత్తం దాదాపుగా ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్ విధించాయి. అయినా పాజిటివ్ కేసులు, మరణాలు అత్యధిక సంఖ్యలో సంభవించాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో ప్రభావాన్ని చూపిన కరోనాని కట్టడి చేయడం సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వ్యాక్సిన్ వచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 62 లక్షలు దాటాయి. బ్రెజిల్, రష్యాల్లో వైరస్ ఉధృతి కొనసాగుతోంది.

ఇక భారత్ విషయానికి వస్తే మొన్నటి వరకు పదో స్థానంలో ఉండేది రెండు మూడు రోజుల్లోనే ఏడో స్థానానికి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసులు 62,66,875 కాగా, 3,73,960 మంది మృతి చెందారు. 28.47.525 మంది కోలుకున్నారు. అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్‌లలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో గత 24 గంటల్లో మొత్తం 18,37,170 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,06,195 మంది మరణించారు. కోలుకున్న వారి సంఖ్య 5,99,867.

అలాగే బ్రెజిల్, స్పెయిన్ దేశాల్లో మరణాల సంఖ్య 50 వేలు దాటింది. ఇటలీలో 33 వేలు, రష్యాలు 4,600 మంది మృత్యువాత పడ్డారు. ఫ్రాన్స్‌‌లో 28 వేల మంది వరకు మరణించారు. ఇక బ్రిటన్‌లో అయితే మరణాల సంఖ్య 39 వేలకు చేరుకుంది. లాక్డౌన్ సడలింపులు, వాతావరణంలో మార్పు వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందనేది అధికారులు అంచనా వేయలేకపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story