తెలంగాణలో కరోనా పంజా.. వారం రోజులుగా పెరుగుతున్నకేసులు

తెలంగాణలో కరోనా పంజా.. వారం రోజులుగా పెరుగుతున్నకేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. వారం రోజులుగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండటం భయాందోళనలకు గురిచేస్తోంది. మే 27న 107 నమోదు కాగా... 28న 117.. 29న 169.. 30న 74 కేసులు నమోదయ్యాయి. ఇక, ఆదివారం ఏకంగా 199 మందికి కరోనా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది.

ముఖ్యంగా జీహెచ్‌ఎంసీతో పాటు.. చుట్టుపక్కల జిల్లాల్లో కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్ ఏవైపు నుంచి వస్తుందోనని వణికిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పహాడీ షరీఫ్‌లో అన్నదమ్ములకు చెందిన ఐదు కుటుంబాల్లో 43 మంది వైరస్ బారినపడ్డారు.

ఆరు రోజుల క్రితం ఇక్కడ 14 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. తర్వాత మరో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అనుమానంతో ఈ నెల 30న మరో 31 మందికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 21 మందికి కరోనా పాజటివ్ వచ్చింది. అందులో పదిమంది చిన్నారులు వుండటంతో అధికారులు ఖంగుతిన్నారు. ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ చేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అటు నగరంలో 9 మంది కానిస్టేబుళ్లకు తాజాగా కరోనా పాజిటివ్ రావడం ఆందోళనకు గురిచేస్తోంది.

Tags

Next Story