సినీ నటికి కరోనా.. భర్త, అత్తమామలకూ..

సినీ నటికి కరోనా.. భర్త, అత్తమామలకూ..
X

బాలీవుడ్ హీరోయిన్‌తో సహా ఆమె కుటుంబసభ్యులకు కరోనా వైరస్ సోకింది. యే రిష్టా క్యా కహ్లేత హై హిందీ సినిమా హీరోయిన్ మోహెనా కుమారి సింగ్‌తో పాటు ఆమె కుటుంబసభ్యులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. మోహెనా గత ఏడాది అక్టోబరులో ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి కుమారుడు సుయేష్ రావత్‌ను వివాహం చేసుకుంది. ఆమెకు, ఆమె భర్త రావత్‌కి, మామ గారు సత్పాల్ మహారాజ్‌లకు కరోనా సోకడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. మాకు కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నాయని డాక్టర్లు వివరించారు. త్వరగానే కోలుకుంటామని భావిస్తున్నా అంటూ మోహెనా ట్వీట్ చేసింది. ఆమె అత్తగారు అమృత రావత్ కూడా కరోనాతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మోహెనా వివాహానంతరం అత్తవారిల్లైన డెహ్రాడూన్‌లో నివసిస్తున్నారు.

Tags

Next Story