జలవనరుల శాఖలో నీళ్లు అమ్ముకుంటున్నారు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

జలవనరుల శాఖలో నీళ్లు అమ్ముకుంటున్నారు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

అధికారుల తీరుపై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వెంకటగిరి నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన జిల్లా జలవనరుల శాఖలో నీళ్లు అమ్ముకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చెప్పారు. వెనుకబడిన ప్రాంతమైన వెంకటగిరికి రావడం తన పొరపాటా..? లేక ప్రజలు చేసుకున్న గ్రహపాటా..అంటూ ఆవేదన వ్యక్తం చేశారు...ఏడాది అయినా సిమెంటు, ఇసుక ఎందుకు రావడం లేదని అధికారులను నిలదీశారు. వెంకటగిరి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా లిస్టులోంచి తీసేశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..వెంకటగిరి ప్రజల కోసం నేతలను, అధికారులను నిలదీసేందుకు తాను సిద్ధం అని ప్రకటించారు ఆనం..

Tags

Next Story