తెలంగాణను కలవరపెడుతున్న కరోనా.. కొత్తగా 129 కేసులు

తెలంగాణను కలవరపెడుతున్న కరోనా.. కొత్తగా 129 కేసులు
X

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 129 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3020కి చేరాయని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది. ఈరోజు నమోదై కేసుల్లో 108 మంది జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలో లో ఆరేసి కేసులు నమోదు కాగా.. మేడ్చల్, సిరిసిల్లలోరెండేసి కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి, యాదాద్రి, మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కోకేసు నమోదైంది. ఈరోజు కరోనాతో ఏడుగురు మృతి చెందగా మొత్తం మృతులు 99కి చేరారు. ఇప్పటి వరకూ 1556 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1365 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story