విశాఖలో పడగవిప్పిన రాజకీయ కక్షలు.. వైసీపీలో బుసలు కొట్టిన వర్గపోరు

విశాఖలో పడగవిప్పిన రాజకీయ కక్షలు.. వైసీపీలో బుసలు కొట్టిన వర్గపోరు
X

విశాఖ జిల్లాలో రాజకీయ కక్షలు బుసలు కొట్టాయి. సొంతపార్టీలో వర్గపోరు ఓ వ్యక్తిపై హత్యప్రయత్నానికి దారితీసింది. విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమ్మలపూడి గ్రామంలో.. తన అనుచరులతో కలిసి జాగింగ్ చేస్తుండగా.. ఆటోలో వచ్చిన ఏడుగురు వ్యక్తులు కత్తులతో అతి కిరాతంగా దాడి చేసి పరారయ్యారు.

ఆటోలో వచ్చిన 9 మంది ప్రత్యర్థులు.. జాగింగ్ చేస్తున్న సత్యనారాయణను ఢీకొట్టారు. దీంతో సత్యనారాయణ కిందపడిపోయాడు. ఆటో కూడా బోల్తాపడింది. బ్రేకులు ఫెయిల్ అయివుండవచ్చనుకుని.. తన అనుచరులతో కలిసి ఆటోను లేపే ప్రయత్నం చేస్తుండగానే.. ఆటోలో నుంచి దిగిన ఏడుగురు వ్యక్తులు.. సత్యనారాయణపై కత్తులతో కిరాతంగా దాడి చేశారు. తప్పించుకుని పరుగులు పెట్టగా.. వెంటాడి వెంటాడి మరీ దాడి చేశారు. అరుపులు విన్న గ్రామస్తులు బయటికి రావడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావం కావడంతో సత్యనారాయణ అతని అనుచరులను.. మొదట రావికమతంలోని ప్రయివేటు ఆసుపత్రికి.. అక్కడి నుంచి విశాఖ డెయిరీ ఆసుపత్రతికి తరలించారు.

గేదెల సత్యనారాయణపై గతంలోనూ ఓసారి హత్యాయత్నం జరిగింది. అప్పట్లో టీడీపీలో వున్న సత్యానారాయణపై.. 2016లో నాటు తుపాకీతో కాల్పులు జరపగా.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నాడు వైసీపీ నేతలపై హ్యత్యా యత్నం కేసు నమోదైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో.. విశాఖ డెయిరీ బోర్డు సభ్యులంతా వైసీపీలో చేరిపోయారు. అయినా పాత కక్షలు మాత్రం ఆగలేదు. దీంతో ఒకే జెండా కింద రెండు వర్గాలు కొనసాగుతున్నాయి.

Tags

Next Story