మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ ఆనం రాంనారాయణ రెడ్డి

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ ఆనం రాంనారాయణ రెడ్డి
X

నెల్లూరు జిల్లా అధికారులపై మరోసారి విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డి. రాష్ట్రంలో 174 నియోజకవర్గాలే ఉన్నాయా? వెంకటగిరి లెక్కలో లేదా అని నిలదీశారు. 20 వేల కోట్ల నిధులు వస్తే వెంకటగిరికి ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టడం లేదని ఆరోపించారు. విషయాన్ని స్వయంగా మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదన్నారు. ముఖ్యమంత్రి లేఖ తీసుకొచ్చి మంత్రులు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వెంకటగిరి అభివృద్ధికి సహకరించట్లేదని అగ్రహం వ్యక్తం చేశారు.. సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోతే జల్లా అయినా రాష్ట్ర స్థాయి అధికారులైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు ఆనం.

Tags

Next Story