జూన్ 8 నుంచి యాదాద్రి స్వామి వారి క్షేత్రంలో భక్తులకు పునః ప్రవేశం

జూన్ 8 నుంచి యాదాద్రి స్వామి వారి క్షేత్రంలో భక్తులకు పునః ప్రవేశం

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో.. జూన్ 8వ తేదీ నుంచి దర్శనాలను పునః ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 22తేదీ నుంచి.. ప్రభుత్వం యాదాద్రిలో భక్తుల దర్శనాలు, రాకపోకలను నిషేధించింది. కేవలం స్వామి వారి ఏకాంత సేవలు, నిత్య కైంకర్యాలను మాత్రమే ప్రతి రోజు నిర్వహిస్తున్నారుఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో మినహాయింపులు ఇస్తూ.. జూన్8 నుంచి ఆలయాలు, ప్రార్ధన మందిరాలను తెరచుకోవచ్చని చెప్పింది. ఈనేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయంలో కూడా భక్తుల దర్శనాలను ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. భక్తులు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక దర్శనం లైన్ లను ఏర్పాటు చేశారు. ప్రతి భక్తుడికి థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేసిన తర్వాతే ఆలయం లోపలికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాగే.. పదేళ్ళ లోపు వయస్సున్న పిల్లలు, 60 ఏళ్లకు పైబడిన వారికి ఆలయంలోకి అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన కోవిడ్-19 నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తామని ఆలయ అధికారులు, సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. గత మూడేళ్లుగా.. యాదాద్రి మూల విరాట్ కొలువైన ప్రధాన ఆలయం పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో.. ఆ నమూనాతో ఏర్పాటైన "బాలాలయంలో" కోవిడ్-19 నిబంధనలతో స్వామి వారి దర్శనాలు యధావిధిగా కొనసాగనుండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story